HomeజాతీయంIPS Officer Puran Kumar | అధికారి బలవన్మరణంపై రాజకీయ దుమారం..

IPS Officer Puran Kumar | అధికారి బలవన్మరణంపై రాజకీయ దుమారం..

IPS Officer Puran Kumar | హరియాణా క్యాడర్‌ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్​ , అదనపు డీజీపీ పూరన్​ కుమార్ తన సర్వీస్ రివాల్వరుతో కాల్చుకొని సూసైడ్​ చేసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: IPS Officer Puran Kumar | హరియాణా క్యాడర్‌ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్​ Haryana cadre senior IPS officer, అదనపు డీజీపీ పూరన్​ కుమార్ తన సర్వీస్ రివాల్వరుతో కాల్చుకొని సూసైడ్​ చేసుకున్నారు.

ఈ విషాద చండీగఢ్ Chandigarh సెక్టార్ 11లో ఉన్న ఆయన నివాసంలో జరిగింది. కాగా, పూరన్‌ కుమార్‌ Additional DGP Puran Kumar ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారి తీసింది. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

పూరన్ కేసు విషయంలో సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ వరుణ్ చౌదరి Congress MP Varun Chowdhury చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం (అక్టోబరు 10) పంజాబ్ గవర్నర్ Punjab Governor, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియా Chandigarh Administrator Gulab Chand Kataria ను కలిసి కోరారు.

IPS Officer Puran Kumar | ఖర్గే విమర్శలు

ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi పాలనలో దళిత, ఆదివాసీలపై నేరాలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే Congress President Mallikarjun Kharge విమర్శించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో-(ఎన్​సీఆర్​బీ) డేటాను ఇందుకు ఉదహరణగా పేర్కొన్నారు.

దళితులపై 2013 – 23 ఏళ్ల మధ్య నేరాలు 46 శాతం పెరిగాయన్నారు. ఆదివాసీలపై 91 శాతం నేరాలు పెరిగాయని ఆరోపించారు. హరియాణా ఐపీఎస్ అధికారిపై కుల వివక్ష జరిగిందన్నారు.

సీజేఐపై దాడి, ఓం వాల్మీకి వేధింపులు, రాజస్థాన్‌లోని వృద్ధ దళిత మహిళ కమలా దేవిపై జరిగిన దారుణాలను ఉదహరించారు. ఈ ఘటనలు బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్ భూస్వామ్య మనస్తత్వానికి ప్రమాదకరమైన ఉదాహరణలు ఖర్గే చెప్పుకొచ్చారు.