HomeUncategorizedIPS Anjaneyulu | సీఐడీ కస్టడీకి ఐపీఎస్​ ఆంజనేయులు

IPS Anjaneyulu | సీఐడీ కస్టడీకి ఐపీఎస్​ ఆంజనేయులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:IPS Anjaneyulu | ఏపీ నిఘా విభాగం మాజీ చీఫ్​, ఐపీఎస్​ పీఎస్​ఆర్​ ఆంజనేయులకు కోర్టు షాక్​ ఇచ్చింది. ఆయనకు మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీ(CID custody)కి అనుమతి ఇచ్చింది. సినీనటి కాదంబరి జెత్వాని(Kadambari Jethwani)పై అక్రమంగా కేసు పెట్టడంతో వేధించారని ఆంజనేయులు(Anjaneyulu)ను ఏపీ సీఐడీ పోలీసులు(AP CID Police) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జ్యూడిషియల్​ రిమాండ్​లో ఉన్న ఆయనకు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ సీఐడీ కోర్టులో అధికారులు పిటిషన్​(Petition) వేశారు. ఈ మేరకు కోర్టు మూడు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. కాగా జెత్వానీ కేసు విషయంలో ఆయనను అధికారులు ప్రశ్నించనున్నారు.