Homeక్రీడలుIPL 2025 : Kavya Maran : SRH vs DC : కావ్య మారన్...

IPL 2025 : Kavya Maran : SRH vs DC : కావ్య మారన్ క్యూట్ రియాక్షన్.. వైరల్!

- Advertisement -

Akshara Today: IPL 2025 : Kavya Maran : SRH vs DC :  ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈ మ్యాచ్‌ రద్దయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ kavya maran మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మ్యాచ్‌కు హాజరైన కావ్యమారన్ ప్రేక్షకుల గ్యాలరీలో సందడి చేశారు. సన్‌రైజర్స్ బౌలర్ల వికెట్లు తీసినప్పుడు సంతోషంతో ఎగిరి గంతేసారు.

ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ dellhi capitals క్యాపిటల్ ఆల్‌రౌండర్ విప్రజ్ నిగమ్ vipram nigam స్వీయ తప్పిదంతో రనౌట్ అయిన సమయంలో కావ్య మారన్ ఇచ్చిన క్యూట్ రియాక్షన్.. ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. జీషన్ అన్సారీ వేసిన 13వ ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌తో సమన్వయ లోపం వల్ల విప్రజ్ నిగమ్ రనౌటయ్యాడు. ఈ ఓవర్ తొలి బంతిని స్టబ్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడి.. క్విక్ డబుల్ తీసే ప్రయత్నం చేయగా విప్రజ్ నిగమ్ పట్టించుకోలేదు. అతను డబుల్‌కు నిరాకరించినా.. వినిపించుకోని స్టబ్స్ రెండో పరుగు పూర్తి చేశాడు. బంతిని అందుకున్న అనికేత్ వర్మ ఎలాంటి తప్పిదం చేయకుండా బౌలర్‌ అన్సారీకి బంతిని అందించడంతో విప్రజ్ నిగమ్ రనౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు.

ఈ రనౌట్‌కు ఎగిరి గంతేసిన కావ్య మారన్.. ఫసక్ ఫసక్ అని చేతులతో సైగలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం సన్‌రైజర్స్ srh బ్యాటింగ్ చేసే సమయానికి భారీ వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గినా మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు.

Must Read
Related News