Gold Mining | భూగ‌ర్భం లోప‌ల నెలల తరబడి ఉండి బంగారం త‌వ్వుతా.. కుప్పలుగా అస్తిపంజ‌రాలు కనిపిస్తాయి.. అక్రమ మైనింగ్ లో పనిచేసే ఓ వ్యక్తి గాథ..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gold Mining | దక్షిణాఫ్రికా(South Africa)లోని ఒక చిన్న పట్టణం… మాఫియా గ్యాంగ్‌లు నియంత్రించే ఈ పట్టణంలో సుమారు 600 మంది నివసిస్తున్నారు. వీరిలో డుమిసో అనే వ్యక్తి కథ అనేది ఈ ప్రాంతంలోని వేలాది మంది అక్రమ మైనర్ల జీవితం ఎలా ఉంటుందో మనకు అద్దంపడుతుంది. ఈ పట్టణం భూగర్భంలో, ఒక నిరుపయోగంగా మారిన బంగారు గనిలో ఉంది. దీనికి ఓ ప్రత్యేకత ఏమిటంటే.. సొంత మార్కెట్, రెడ్ లైట్ ఏరియా, రెస్టారెంట్లు, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gold Mining | దక్షిణాఫ్రికా(South Africa)లోని ఒక చిన్న పట్టణం… మాఫియా గ్యాంగ్‌లు నియంత్రించే ఈ పట్టణంలో సుమారు 600 మంది నివసిస్తున్నారు. వీరిలో డుమిసో అనే వ్యక్తి కథ అనేది ఈ ప్రాంతంలోని వేలాది మంది అక్రమ మైనర్ల జీవితం ఎలా ఉంటుందో మనకు అద్దంపడుతుంది. ఈ పట్టణం భూగర్భంలో, ఒక నిరుపయోగంగా మారిన బంగారు గనిలో ఉంది. దీనికి ఓ ప్రత్యేకత ఏమిటంటే.. సొంత మార్కెట్, రెడ్ లైట్ ఏరియా, రెస్టారెంట్లు, మరియు జీవనశైలితో కూడిన పూర్తిస్థాయి భూగర్భ కమ్యూనిటీగా మారింది. డుమిసో ఒకప్పుడు పెద్ద మైనింగ్ కంపెనీలో ఉద్యోగి. 1996 వరకు డ్రిల్ ఆపరేటర్‌గా పని చేసిన ఆయన, ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు చట్టబద్ధమైన ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. చివరికి జీవనోపాధికోసం అక్రమ మైనింగ్‌(Illegal mining)ను ఎంచుకున్నాడు.

Gold Mining | బ‌తుకు తెరువు కోసం..

ఇక్కడ అక్రమ మైనింగ్‌కి వెళ్లే వారిని “జామాజామా”(Jamajama)లు అంటారు. విలువైన లోహాల కోసం గనుల లోతుల్లోకి వెళ్లి నెలల తరబడి జీవించాల్సి వస్తుంది. ‘‘భూమి అడుగున జీవితం చాలా దారుణం. మృతదేహాలతో నిండి ఉన్న అంతస్తులు ఉంటాయి. వాటిని మేము ‘జామాజామా స్మశానం’గా పిలుస్తాం,’’ అని డుమిసో చెప్పుకొచ్చాడు . అక్కడ పని చేయాలంటే గ్యాంగ్‌లకు ప్రొటెక్షన్ ఫీజులు చెల్లించాలి. డుమిసో తన గ్యాంగ్‌కు నెలకు $8 (రూ.676) చెల్లిస్తాడు. పిస్టల్‌తో పనిచేసే డుమిసో, బంగారాన్ని వెలికితీయడానికి డైనమైట్, గొడ్డలిలు, పారల వంటి సాధనాలను వాడుతాడు. తనకిచ్చే వాటాలో కొంత బంగారాన్ని డుమిసో భూమిపైకి తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లో(black market) అమ్ముతాడు. అధికారిక ధర $77 అయినప్పటికీ, గ్రాము బంగారాన్ని అతను $55కి అమ్ముతాడు.

డుమిసో తన కుటుంబాన్ని పోషించడానికి ఈ పని చేస్తాడు. నెలలు తరబడి గనుల్లో జీవించి, తరువాత రెండు మూడు వారాల పాటు కుటుంబంతో గడిపేందుకు పైకి వస్తాడు. అతని ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు. అందులో ఒకరు యూనివర్సిటీ విద్యార్థి. ‘‘నాకు తెలిసింది ఇదొక్కటే. దొంగతనం కన్నా ఇది మేలైన పని. ప్రాణం ఉన్నంతవరకూ పిల్లల కోసం ఈ కష్టం భరిస్తా అని డుమిసో అంటాడు. అయితే అక్కడ కూడా రెడ్ లైట్ ఏరియా ఉంది. సెక్స్ వర్కర్లను కూడా గ్యాంగ్‌లు తీసుకెళ్తారు. టాయిలెట్లకు, ఆహారం దొరికే చోట్లకు దారి చూపే గుర్తులు ఉంటాయి. గనుల్లో అంతస్తుల మధ్య హైవేల లాంటి మార్గాలు ఉంటాయి. స్థానిక ప్రభుత్వాలు ఇప్పుడు ఈ అక్రమ మైనింగ్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, దీనివల్ల వేలాది మంది జీవనాధారాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ‘ఈ జామాజామాలను డీక్రిమినలైజ్ చేసి, ఓ నియంత్రిత పద్ధతిలో వారి సేవలను వినియోగించుకోవాలి,’’ అని పరిశోధకుడు డేవిడ్ వాన్ వింక్ అంటారు. ఒకప్పుడు గోల్డ్ మైనింగ్(Gold mining) కంపెనీలో ఉద్యోగిగా ఉన్న డుమిసో, ఇప్పుడు తన పిల్లలకు భవిష్యత్తు కల్పించేందుకు బంగారం తవ్వుతూ మాఫియా ప్రపంచంలో జీవన పోరాటం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...