అక్షరటుడే, బాన్సువాడ: Banswada Police | బీర్కూర్ పోలీస్ స్టేషన్ (Birkur police station) పరిధిలో మహిళను కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి (Banswada DSP Vithal Reddy) సోమవారం వివరాలు వెల్లడించారు.
బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామానికి (Barangedgi village) చెందిన బోయి అనూషబాయి డిసెంబర్ 2న మార్కెట్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి లిఫ్ట్ ఇస్తానని నమ్మించాడు. ఆమెను బైక్‌పై ఎక్కించుకున్న నిందితుడు బైరాపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో బైక్ ఆపి కత్తితో చంపుతానని బెదిరించి ఆమె మెడలోని పుస్తెల తాడు, బంగారు గుండ్లు, కెంపులను బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీర్కూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Banswada Police | ఎస్పీ ఆదేశాల మేరకు..
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు సీసీఎస్ టీం, బాన్సువాడ రూరల్ సీఐ టీం, బీర్కూర్ ఎస్ఐ టీం దర్యాప్తు చేపట్టాయి. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితుడు ఉపయోగించిన బైక్ నంబర్‌లోని కొన్ని అంకెలను గుర్తించి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు.
ఈనెల 18న బీర్కూర్ కమాన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని బీర్కూర్ ఎస్సై, సిబ్బంది దాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అరెస్ట్ అయిన నిందితుడు నాందేడ్ జిల్లాలోని దెగ్లూర్కు చెందిన హన్మంత్ విఠల్గా గుర్తించామన్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా వినియోగించి అంతర్రాష్ట్ర నిందితుడిని పట్టుకున్న బాన్సువాడ రూరల్ ఇన్‌స్పెక్టర్ తిరుపయ్య, బీర్కూర్ ఎస్సై ఎం. మహేందర్‌తో పాటు దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.