AP Assembly | ఏపీ అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ ఫైట్.. బోండా ఉమ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య వాదోప‌వాదాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో శుక్రవారం పరిశ్రమల కాలుష్యం, ప్లాస్టిక్ నియంత్రణ అంశాలపై జరిగిన చర్చ ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా(TDP MLA Bonda Uma), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పరిశ్రమల కాలుష్యం నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని బోండా ఉమ తీవ్రంగా మండిపడ్డారు. “విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) కార్యాలయం లేదు. ప్రజలు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో శుక్రవారం పరిశ్రమల కాలుష్యం, ప్లాస్టిక్ నియంత్రణ అంశాలపై జరిగిన చర్చ ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా(TDP MLA Bonda Uma), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.

పరిశ్రమల కాలుష్యం నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని బోండా ఉమ తీవ్రంగా మండిపడ్డారు. “విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) కార్యాలయం లేదు. ప్రజలు ఫిర్యాదులతో వెళ్లినా ‘డిప్యూటీ సీఎం వద్ద నుంచి చెప్పించండి’ అని తిరస్కరిస్తున్నారు. బోర్డు చైర్మన్ అధికారిగా కాకుండా రాజకీయ సూచనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు” అని ఆయన విమర్శించారు.

AP Assembly | పవన్ కళ్యాణ్ కౌంటర్

బోండా ఉమ వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), అవి తప్పుడు ఆరోపణలని ఖండించారు. “పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందుబాటులో ఉండదని చెప్పడం సరికాదు. మా శాఖ ఇప్పటికే రాంకీ సంస్థపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం జరిగితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. కానీ ఒక సంస్థను లేదా వ్యక్తిని కావాలని టార్గెట్ చేయకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “పరిశ్రమలపై తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటే ఎన్నో కంపెనీలు మూతపడే ప్రమాదం ఉంది.

పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశ్రమల ఉనికిని కూడా సమన్వయం చేయడం అవసరం అని నొక్కి చెప్పారు. అంతేకాదు, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. మూడు నెలల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.మొత్తం మీద పరిశ్రమల కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామికాభివృద్ధి అనే మూడు కీలక అంశాలు అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యేతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాదోపవాదాలు సభను కాసేపు వేడెక్కించాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...