Scorpion | ఆహారం లేకుండా ఏడాది.. శ్వాస తీసుకోకుండా ఆరు రోజులు జీవించే జీవి గురించి తెలుసా..?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Scorpion | భూమిపై జీవించే చాలా జీవులు ఆహారం లేకుండా కొంతకాలం బతకగలిగినా, శ్వాస లేకుండా మాత్రం ఎక్కువరోజులు ఉండ‌లేవు. మనుషుల విషయానికి వస్తే, శ్వాస తీసుకోకపోతే కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. కానీ తేలు (Scorpion) మాత్రం కొన్ని అరుదైన లక్షణాలతో ఇతర జీవులకంటే భిన్నంగా ఉంటుంది. తేలు గురించి మనకు ఎక్కువగా తెలిసింది దీని విషపూరిత స్వరూపం మాత్రమే. అయితే దీని సహనశక్తి, జీవించగల సామర్థ్యం విన్నాక మీరు నిజంగా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Scorpion | భూమిపై జీవించే చాలా జీవులు ఆహారం లేకుండా కొంతకాలం బతకగలిగినా, శ్వాస లేకుండా మాత్రం ఎక్కువరోజులు ఉండ‌లేవు. మనుషుల విషయానికి వస్తే, శ్వాస తీసుకోకపోతే కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. కానీ తేలు (Scorpion) మాత్రం కొన్ని అరుదైన లక్షణాలతో ఇతర జీవులకంటే భిన్నంగా ఉంటుంది. తేలు గురించి మనకు ఎక్కువగా తెలిసింది దీని విషపూరిత స్వరూపం మాత్రమే. అయితే దీని సహనశక్తి, జీవించగల సామర్థ్యం విన్నాక మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. తేలు ఆరు రోజులు శ్వాస తీసుకోకుండా జీవించగలదు.

Scorpion | అలా ఎందుకుంటే..

దీనికి కారణం తేలు శ్వాసకోశ వ్యవస్థ ఎంతో ప్రత్యేకంగా ఉండడం. తేలు ఊపిరితిత్తులు “బుక్ లంగ్స్” (Book Lungs) అనే నిర్మాణంలో ఉంటాయి. ఇవి పుస్తకపు పేజీల్లా ముడుచుకొని ఉండడంతో, తేలు వాటిలో గాలిని నిల్వ చేసుకోగలదు. దాంతో, శ్వాస కోసం ఆక్సిజన్ (Oxigen) బయట నుంచి అందకపోయినా, దాని శరీరంలో ఉన్న గాలితోనే కొన్ని రోజులు జీవించగలదు. ఇంతేకాదు, తేలు ఒక సంవత్సరం పాటు ఆహారం లేకుండా కూడా బతుకుతుంది. తక్కువ నీటి వినియోగంతో, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ తేలు సజీవంగా ఉండగలదు. ఎడారులు, అడవులు, రాళ్ల మధ్య, పొడి ప్రదేశాలలో తేలు త‌న‌ని తాను అనుకూలించుకుంటూ మనుగడ సాగిస్తుంది.

మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే, తేలు చర్మంపై అతినీలాలోహిత కాంతి పడినప్పుడు అది మెరిసిపోతుంది. ఇది శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. మన దేశంలో కనిపించే ఇండియన్ రెడ్ స్కార్పియన్ (Indian Red Scorpion) ప్రపంచంలోని అత్యంత విషపూరిత తేళ్లలో ఒకటి. ఇది కాటు వేసిందంటే 72 గంటలలోపు చికిత్స తీసుకోవడం అత్యంత అవసరం, లేకపోతే అది ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ తేలు భారతదేశంతో పాటు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ (Bangladesh) లాంటి దేశాల్లోనూ కనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే, తేలు ఒక సింపుల్ క్రూర జీవి కాదని, అద్భుతమైన అనుకూలతా సామర్థ్యం కలిగిన జీవి అని చెప్పవచ్చు. తేలు గురించి ఈ విష‌యాలు తెలుసుకున్న వారు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...