అక్షరటుడే, వెబ్డెస్క్ : Intel Layoffs | ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ వినియోగం పెరగడంతో ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రముఖ టెక్ సంస్థలు (Leading Tech Companies) సైతం ఉద్యోగులను ఇళ్లకు పంపుతున్నాయి. తాజాగా చిప్ తయారీ సంస్థ ఇంటెల్ (Intel) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. 5 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఖర్చుల తగ్గింపులో భాగంగానే లేఆఫ్స్ ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచ యుద్ధ భయాలు, ట్రేడ్ వార్లతో ఆర్థిక అస్థిరత నెలకొంది. దీంతో చాలా కంపెనీల లాభాలు తగ్గాయి. అంతేగాకుండా ఏఐ వినియోగం(Use Of AI) పెరిగింది. ఈ క్రమంలో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఇంటెల్ 5 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ వారంలోనే అమెరికా (America) వ్యాప్తంగా తొలగింపులు ఉంటాయని ఆ సంస్థ ప్రకటించింది.
Intel Layoffs | ఆందోళనలో ఐటీ ఉద్యోగులు
టెక్ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండడంతో ఐటీ ఉద్యోగులు (IT Employees) ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. తాజాగా ఇంటెల్ ఐదు వేల మందిని ఇంటికి పంపింది. ఇదే వరుసలో చాలా కంపెనీలు ఉన్నట్లు సమాచారం. ఏఐ వినియోగం పెరగడంతో.. కంపెనీలు ఉద్యోగుల సంఖ్య తగ్గించి, ఆ పనిని ఏఐతో చేయించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొనే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కొలువులు కోల్పోనున్నారు. దీనిప్రభావం మన దేశంపై అధికంగా పడే అవకాశం ఉంది.
