64
అక్షరటుడే, బోధన్ : Municipal Elections | రాబోయే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా గురువారం బోధన్ (Bodhan) పట్టణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) పరిశీలించారు.
Municipal Elections| ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..
బోధన్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College), జూనియర్ కళాశాలను ఆయన పరిశీలించారు. నామినేషన్ సందర్భంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాహతో (Sub-Collector Vikas Mahato), మున్సిపల్ కమిషనర్ యాదవ్ కృష్ణ తదితరులున్నారు.