అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండలంలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి (Indiramma Illu) నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డీఆర్డీవో సురేందర్ (DRDO Surender) అన్నారు. మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి విడతల వారీగా నేరుగా వారి అకౌంట్లలోనే డబ్బులు జమ చేస్తుందని వివరించారు. ఆయన వెంట ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి తదితరులు ఉన్నారు.
