అక్షరటుడే, కమ్మర్పల్లి : Indiramma Sarees | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలు (Indiramma Sarees) ఎంతో నాణ్యమైనవని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఇనాయత్‌నగర్‌లో సోమవారం మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం (State Government) మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుతో నాణ్యమైన చీరలను అందిస్తోందన్నారు. ఈ చీరలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంచిన చీరలతో పోలిస్తే చాలా నాణ్యమైనవన్నారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం తాము ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తుంటే.. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పంపిణీ చేస్తున్నారని అనడం సబబు కాదన్నారు. ఎన్నికల షెడ్యూల్ కారణంగానే పంపిణీ ఆలస్యమైందన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తున్నామన్నారు.
డిసెంబర్ తర్వాత రేషన్‌కార్డు పంపిణీ పూర్తిచేసిన తర్వాత పెన్షన్ల కార్యక్రమం ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడినప్పటి నుంచి రెండేళ్లుగా ప్రతి ఇంటికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు సుంకెట రవి, జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పిరెడ్డి శ్రీను, రాములు నాయక్, సుతారి రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
