Homeజిల్లాలుకామారెడ్డిIndiramma housing scheme |అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

Indiramma housing scheme |అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Indiramma housing scheme | అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని మహమ్మద్ నగర్ (Mahammad Nagar) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. మహమ్మద్​నగర్ మండలంలోని మగ్దుంపూర్​లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేసి భూమిపూజ చేశారు.

అనంతరం సింగితం (Singitam) గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులకు పథకాలు అందజేయడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో సవాయ్​సింగ్, నాగభూషణం, ఖాలిక్, మల్లయ్య గారి ఆకాష్, గంగి రమేష్, మోయిన్, అజయ్, కిష్టయ్య, హతిక్ తదితరులు పాల్గొన్నారు.