అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma houses Scheme | రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయన గురువారం అశ్వరావుపేటలో ప్రచారం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్‌ను గెలిపించాలని మంత్రి కోరారు. అశ్వారావుపేటలో 22 వార్డుల్లో ఉండగా.. 21 కాంగ్రెస్, 1 స్థానంలో సీపీఎం పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అశ్వారావుపేటలో ఇల్లు కట్టుకున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇల్లు లేని పేదలకు ఏడెకరాలలో ఇండ్ల స్థలం కూడా చూశామన్నారు. మూడంతస్తులలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసి నిరుపేదలందరికీ అందజేస్తామని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు అన్ని రకాలుగా అండదండలను అందించారని గుర్తు చేశారు. అశ్వరావుపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు.
Indiramma houses Scheme | కొత్తగూడెంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్లో (Kothagudem Corporation) సైతం మంత్రి ప్రచారం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఓటు వేస్తేనే కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యమన్నారు. స్వతంత్ర అభ్యర్థులు తన పేరు చెప్పుకొని ఓట్లు అడిగితే వేయొద్దన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.