అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) నూతన వారాన్ని ఉత్సాహంతో ప్రారంభించినా నిలదొక్కుకోలేకపోయాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 359 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 94 పాయింట్లు పెరిగింది.
ఆల్‌టైం హై వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 670 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ (Nifty) 123 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేకపోయింది. అక్కడినుంచి 201 పాయింట్లు పడిపోయింది. తర్వాత కాస్త కోలుకున్నాయి. సెన్సెక్స్(Sensex) 64 పాయింట్ల నష్టంతో 85,641 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద స్థిరపడ్డాయి.
ఆటో, మెటల్ సెక్టార్లలో కొనుగోళ్ల మద్దతు..
బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్ 0.80 శాతం, మెటల్ ఇండెక్స్ 0.56 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.48 శాతం, ఐటీ 0.33 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.32 శాతం పెరిగాయి. రియాలిటీ ఇండెక్స్ 1.02 శాతం, హెల్త్‌కేర్ 0.62 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.56 శాతం, టెలికాం 0.27 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం లాభపడ్డాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం నష్టపోయాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో ఉండగా.. 15 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ 1.93 శాతం, మారుతి 1.40 శాతం, బీఈఎల్ 1.36 శాతం, కొటక్ బ్యాంక్ 1.12 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.95 శాతం లాభపడ్డాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 1.65 శాతం, సన్‌ఫార్మా 1.28 శాతం, ట్రెంట్ 0.76 శాతం, ఎస్‌బీఐ 0.65 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.61 శాతం నష్టపోయాయి.
