అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) లాభాల బాటలో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ దూసుకుపోతున్నాయి. నిఫ్టీ 25 వేల పాయింట్లపైన నిలదొక్కుకోగా.. సెన్సెక్స్ 82 వేల మార్క్‌ను దాటింది.
మంగళవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 93 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సూచీలు నిలకడగా పెరుగుతున్నాయి. సెన్సెక్స్ 81,787 నుంచి 82,211 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ(Nifty) 25,076 నుంచి 25,201 పాయింట్ల మధ్యలో సాగుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 206 పాయింట్ల లాభంతో 81,997 వద్ద, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 25,129 వద్ద ఉన్నాయి.
Stock Market | మిక్స్‌డ్‌గా సూచీలు..
బీఎస్‌ఈ(BSE)లో టెలికాం ఇండెక్స్ 0.89 శాతం పెరగ్గా.. ఆటో 0.49 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.43 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.41 శాతం, ఎనర్జీ 0.40 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.33 శాతం లాభాలతో ఉన్నాయి. రియాలిటీ ఇండెక్స్ 0.53 శాతం, ఐటీ(IT) ఇండెక్స్ 0.36 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.28 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.25 శాతం నష్టాలతో ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం లాభాలతో ఉండగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం నష్టంతో ఉంది.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో ఉండగా.. 15 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
ఎటర్నల్ 1.33 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.20 శాతం, ఎయిర్‌టెల్ 1.11 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.94 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.89 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ట్రెంట్ 2.30 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.81 శాతం, టాటామోటార్స్ 1.03 శాతం, హెచ్‌యూఎల్ 0.85 శాతం, ఇన్ఫోసిస్ 0.84 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.