Homeబిజినెస్​Stock Market | ఒడిదుడుకుల్లో సూచీలు.. కొత్త రికార్డులు సృష్టించిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market | ఒడిదుడుకుల్లో సూచీలు.. కొత్త రికార్డులు సృష్టించిన సెన్సెక్స్‌, నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ ఆల్‌టైం హైకి చేరిన తర్వాత ప్రాఫిట్‌ బుకింగ్‌తో ఒత్తిడికి గురయ్యాయి. మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో స్వల్ప నష్టాలతో ఉన్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic Stock Markets) నూతన వారాన్ని ఉత్సాహంతో ప్రారంభించాయి. సోమవారం సెన్సెక్స్‌, నిఫ్టీలు నూతన గరిష్టాలకు చేరాయి. ఉదయం సెన్సెక్స్‌ 359 పాయింట్ల గ్యాప్‌ అప్‌లో ప్రారంభమై మరో 94 పాయింట్లు పెరిగింది.

ఆల్‌టైం హై వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 510 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ (Nifty) 123 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేకపోయింది. అక్కడినుంచి 146 పాయింట్లు పడిపోయింది. మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 115 పాయింట్ల నష్టంతో 85,590 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 26,163 వద్ద ఉన్నాయి.

మెటల్‌, ఆటోలో కొనుగోళ్ల మద్దతు..

బీఎస్‌ఈ(BSE)లో మెటల్‌ ఇండెక్స్‌, ఆటో ఇండెక్స్‌ 0.48 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.32 శాతం, ఐటీ 0.24 శాతం, ఎనర్జీ 0.23 శాతం లాభాలతో ఉన్నాయి. రియాలిటీ ఇండెక్స్‌ 1.01 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.77 శాతం, యుటిలిటీ 0.32 శాతం, హెల్త్‌కేర్‌ 0.29 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌ 0.20 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.20 శాతం లాభాలతో ఉండగా.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.19 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.05 శాతం నష్టంతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 14 కంపెనీలు లాభాలతో ఉండగా.. 16 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. కొటక్‌ బ్యాంక్‌ 1.18 శాతం, అదానీ పోర్ట్స్‌ 1.04 శాతం, టాటామోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ 0.99 శాతం, హెచ్‌యూఎల్‌ 0.71 శాతం, హెచ్‌సీఈఎల్‌ టెక్‌ 0.63 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బజాజ్‌ ఫైనాన్స్‌ 1.30 శాతం, సన్‌ఫార్మా 0.94 శాతం, టైటాన్‌ 0.86 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.76 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.65 శాతం నష్టాలతో ఉన్నాయి.

Must Read
Related News