అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య అస్థిరతలతో ఆసియా మార్కెట్లు(Asian Markets) నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. దాని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. సెషన్‌ను లాభాలతో ప్రారంభించినా అమ్మకాల ఒత్తిడితో ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోకి జారుకున్నాయి.
మంగళవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 77 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో లాభాల దిశగా సాగిన మార్కెట్లు కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 82,573 పాయింట్ల వరకు పెరిగి అక్కడినుంచి 82,081 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 25,310 నుంచి 25,151 పాయింట్లకు పడిపోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 284 పాయింట్ల నష్టంతో 82,042 వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 25,152 వద్ద ఉన్నాయి.
అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి..
అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్‌ఈ(BSE)లో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.33 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.07 శాతం, రియాలిటీ, సర్వీసెస్ ఇండెక్స్‌లు ఒక శాతం చొప్పున, హెల్త్‌కేర్ 0.87 శాతం, యుటిలిటీ 0.73 శాతం, టెలికాం 0.69 శాతం, పీఎస్‌యూ 0.65 శాతం, కమోడిటీ 0.65 శాతం, పవర్ 0.64 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.63 శాతం, Metal 0.62 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.80 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.39 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటామోటార్స్ 2.21 శాతం, టెక్ మహీంద్రా 1.10 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.41 శాతం, రిలయన్స్ 0.25 శాతం, హెచ్‌యూఎల్ 0.14 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 2.02 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.47 శాతం, మారుతి 1.15 శాతం, ఎన్టీపీసీ 1.04 శాతం, టీసీఎస్ 1.01 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.