అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) లాభాల బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్ 470 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 154 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.
ఆసియా మార్కెట్లు(Asian Markets) లాభాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం పాజిటివ్‌గా ఉన్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 168 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 36 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో కొద్దిసేపు ఊగిసలాడినా తర్వాత క్రమంగా పైకి పెరిగాయి. ఇంట్రాడే(Intraday)లో సెన్సెక్స్ 82,084 నుంచి 82,596 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 25,159 నుంచి 25,326 పాయింట్ల మధ్యలో కదలాడుతోంది. మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 470 పాయింట్ల లాభంతో 82,500 వద్ద, నిఫ్టీ 154 పాయింట్ల లాభంతో 25,300 వద్ద ఉన్నాయి.
Stock Market | అన్ని రంగాల్లో జోరు..
అన్ని రంగాల షేర్లు జోరుమీదున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో రియాలిటీ ఇండెక్స్ 3.40 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్(PSU bank index) 1.56 శాతం, టెలికాం 1.38 శాతం, పీఎస్‌యూ 1.31 శాతం, ఇన్‌ఫ్రా 1.31 శాతం, పవర్ 1.19 శాతం, మెటల్ 1.19 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 1.16 శాతం లాభాలతో ఉన్నాయి. మిగిలిన రంగాల షేర్లూ గణనీయంగా పెరిగాయి. మిడ్ క్యాప్(Mid cap) ఇండెక్స్ 0.99 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.77 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.58 శాతం లాభంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 26 కంపెనీలు లాభాలతో ఉండగా.. 4 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 2.77 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.65 శాతం, ఎల్‌టీ 2.44 శాతం, ఆసియా పెయింట్ 2.16 శాతం, టాటా స్టీల్ 2 శాతం లాభాలతో ఉన్నాయి.
Losers : ఇన్ఫోసిస్ 1.17 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.77 శాతం, టాటామోటార్స్ 0.66 శాతం, టెక్ మహీంద్రా 0.52 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.