Homeబిజినెస్​Stock Market | భారీగా పతనమైన సూచీలు

Stock Market | భారీగా పతనమైన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమై భారీ నష్టాలతో ముగిశాయి. ఐటీ కంపెనీలు సూచీలను వెనక్కి లాగాయి. సెన్సెక్స్‌ 519 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) ఫ్లాట్‌గా ప్రారంభమై భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 519 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయాయి. ఐటీ కంపెనీలు సూచీలను వెనక్కి లాగాయి.

గ్లోబల్‌ మార్కెట్ల(Global Markets)లోని బలహీనత ప్రభావం మన మార్కెట్లపై కనిపించింది. ఈ నెలలో ఎఫ్‌ఐఐల అమ్మకాలు పెరగడంతో ఒలటాలిటీ పెరిగి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింటోంది. మదుపరులు గరిష్టాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండడంతో సూచీలు పడిపోతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడే(Intraday)లో సెన్సెక్స్‌ 84,068 పాయింట్ల వరకు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. అక్కడినుంచి క్రమంగా క్షీణిస్తూ ఇంట్రాడేలో 83,412 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ(Nifty) ప్రారంభంలో కొంత కోలుకుని 25,787 పాయింట్లకు చేరినా.. అమ్మకాల ఒత్తిడితో 25,578 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ డే(weekly expiry day) కావడంతో మార్కెట్‌లో ఒలటాలిటీ కనిపించింది. చివరికి సెన్సెక్స్‌(Sensex) 519 పాయింట్ల నష్టంతో 83,459 వద్ద, నిఫ్టీ 165 పాయింట్ల నష్టంతో 25,597 వద్ద స్థిరపడ్డాయ.

Stock Market | ఐటీ, మెటల్‌ సెక్టార్లలో పతనం..

ఐటీ(IT), మెటల్‌, కమోడిటీ, ఇన్‌ఫ్రా తదిరత రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. టెలికాం రంగానికి చెందిన కంపెనీలు రాణించాయి. బీఎస్‌ఈలో టెలికాం(Telecom) ఇండెక్స్‌ 0.93 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.11 శాతం పెరిగాయి. యుటిలిటీ ఇండెక్స్‌ 1.56 శాతం, మెటల్‌ 1.40 శాతం, ఇన్‌ఫ్రా 1.24 శాతం, కమోడిటీ 1.11 శాతం, ఐటీ 1.08 శాతం, పవర్‌ 0.99 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.85 శాతం, ఆటో 0.77 శాతం శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 0.69 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.63 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.26 శాతం పడిపోయాయి.

Stock Market | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,618 కంపెనీలు లాభపడగా 2,549 స్టాక్స్‌ నష్టపోయాయి. 162 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 145 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 91 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 5 కంపెనీలు లాభాలతో ఉండగా.. 25 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టైటాన్‌ 2.28 శాతం, ఎయిర్‌టెల్‌ 1.89 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.16 శాతం, ఎంఅండ్‌ఎం 0.93 శాతం, ఎస్‌బీఐ 0.72 శాతం పెరిగాయి.

Top Losers : పవర్‌గ్రిడ్‌ 3.13 శాతం, ఎటర్నల్‌ 2.79 శాతం, టాటా మోటార్స్‌ 2.53 శాతం, టాటా స్టీల్‌ 1.86 శాతం, మారుతి 1.76 శాతం నష్టపోయాయి.