అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | కొత్త హెచ్-1 బీ వీసాల ఫీజు పెంచుతూ యూఎస్ అధ్యక్షుడు ట్రంప్(Trump) తీసుకున్న నిర్ణయం ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై కనిపించింది. ఐటీ సెక్టార్ సెల్లాఫ్‌కు గురయ్యింది. రిలయన్స్(Reliance), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు సైతం ప్రధాన సూచీలను వెనక్కి లాగాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 475 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి తేరుకుని 432 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో 584 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ(Nifty) 89 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా వెంటనే 93 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 180 పాయింట్లు పతనమైంది. చివరికి సెన్సెక్స్(Sensex) 466 పాయింట్ల నష్టంతో 82,159 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల నష్టంతో 25,202 వద్ద స్థిరపడ్డాయి.
ఐటీలో సెల్లాఫ్..
ఐటీ స్టాక్స్(IT stocks) తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనగా.. యుటిలిటీ, పవర్, ఇన్‌ఫ్రా స్టాక్స్ రాణించాయి. బీఎస్‌ఈలో యుటిలిటీ ఇండెక్స్ 2.56 శాతం, పవర్(Power) 1.66 శాతం, ఇన్‌ఫ్రా 0.78 శాతం, మెటల్ 0.39 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.36 శాతం పెరిగాయి. ఐటీ ఇండెక్స్ 2.98 శాతం పడిపోగా.. హెల్త్‌కేర్ 1.08 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.77 శాతం, టెలికాం 0.74 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.49 శాతం, ఆటో ఇండెక్స్ 0.41 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.78 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.71 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం నష్టపోయాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,775 కంపెనీలు లాభపడగా 2,511స్టాక్స్ నష్టపోయాయి. 169 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 210 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 66 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 1.80 లక్షల కోట్ల మేర తగ్గింది.
Top Gainers | బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభపడగా.. 21 కంపెనీలు నష్టపోయాయి. ఎటర్నల్ 1.55 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.31 శాతం, అదాని పోర్ట్స్ 1.17 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.98 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.73 శాతం లాభపడ్డాయి.
Top Losers | టెక్ మహీంద్రా 3.20 శాతం, టీసీఎస్ 3.02 శాతం, ఇన్ఫోసిస్ 2.61 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.84 శాతం, టాటా మోటార్స్ 1.69 శాతం నష్టపోయాయి.