Ayodhya | అయోధ్య రామమందిర ధ్వజారోహణపై భారత్–పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం.. తిప్పికొట్టిన ఇండియా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ayodhya | అయోధ్యలో నిర్మితమైన మహా రామమందిరం పూర్తి కావడంతో, నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అయితే ఈ వేడుకను పాకిస్తాన్ (Pakistan) తీవ్రంగా విమర్శించడం, భారత్–పాక్ మ‌ధ్య‌ మరోసారి ఉద్రిక్తతలకు కార‌ణ‌మైంది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ భారత్‌పై నోరు పారేసుకుంది. అయోధ్య ధ్వజారోహణ కార్యక్రమాన్ని “మతపరమైన మైనారిటీలపై ఒత్తిడి, ముస్లిం వారసత్వాన్ని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ayodhya | అయోధ్యలో నిర్మితమైన మహా రామమందిరం పూర్తి కావడంతో, నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

అయితే ఈ వేడుకను పాకిస్తాన్ (Pakistan) తీవ్రంగా విమర్శించడం, భారత్–పాక్ మ‌ధ్య‌ మరోసారి ఉద్రిక్తతలకు కార‌ణ‌మైంది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ భారత్‌పై నోరు పారేసుకుంది. అయోధ్య ధ్వజారోహణ కార్యక్రమాన్ని “మతపరమైన మైనారిటీలపై ఒత్తిడి, ముస్లిం వారసత్వాన్ని క్షీణింపజేసే ప్రయత్నం”గా అభివర్ణించింది.

Ayodhya | కారు కూత‌లు..

బాబ్రీ మసీదు (Babri Masjid) కూల్చాడాన్ని ఉదహరిస్తూ రామమందిర నిర్మాణాన్ని పాకిస్తాన్ విమర్శించింది. భారత ముస్లింల హక్కులు అణచివేయబడుతున్నాయంటూ ఆరోపణలు గుప్పించింది. “భారత్‌లో పెరుగుతున్న ఇస్లామోఫోబియాను అంతర్జాతీయ సమాజం గమనించాలి” అని పాకిస్తాన్ కోరింది. యునైటెడ్ నేషన్స్ మరియు అంతర్జాతీయ సంస్థలు “ఇస్లామిక్ వారసత్వాన్ని కాపాడడంలో పాత్ర పోషించాలి” అని డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలు మరోసారి పాక్ తన పాత రాజకీయ రాగాన్ని మళ్లీ వినిపించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.

“మతతత్వం, మైనారిటీల అణచివేతలో నిందిత దేశం పాకిస్తాన్. అలాంటి దేశానికి ఇతరులకు పాఠాలు చెప్పడానికి అర్హత లేదు” అని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన సొంత దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. అయితే వివాదం వెనుక అసలు సంగతేంటంటే.. అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) ప్రపంచవ్యాప్తంగా హిందువుల విశ్వాసానికి ప్రతీక. నిర్మాణం పూర్తయ్యాక ధ్వజారోహణం జరగడం చారిత్రక క్షణంగా పరిగణించబడింది. అయితే పాకిస్తాన్ గతంలోలా ఇప్పటికీ ఈ అంశాన్ని మతపరంగా ప్రస్తావిస్తూ భారత్‌పై విమర్శలు గుప్పించడం కొత్తేమీ కాదు. భారత్​ మాత్రం తన రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తుందన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...