అక్షరటుడే, వెబ్‌డెస్క్: stock market gap down opening | భారత్, యూఎస్‌ల మధ్య ట్రేడ్ డీల్ నేపథ్యంలో గత సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. అయితే బలహీనమైన గ్లోబల్ మార్కెట్ సంకేతాల నేపథ్యంలో బుధవారం మన మార్కెట్లు సైతం నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గత సెషన్లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు(European markets) నష్టాలతో ముగిశాయి. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty) నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్లో ప్రారంభం కానున్నాయి.
stock market gap down opening | యూఎస్ మార్కెట్లు..
టెక్ స్టాక్స్‌లో బలహీనత కారణంగా వాల్‌స్ట్రీట్ నష్టపోయింది. గత సెషన్లో నాస్డాక్(Nasdaq) 1.42 శాతం, ఎస్అండ్పీ 0.85 శాతం పడిపోయాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.14 శాతం లాభంతో ఉంది. కాగా.. యూరప్ మార్కట్లు అయిన ఎఫ్టీఎస్ఈ 0.26 శాతం, డీఏఎక్స్(DAX) 0.07 శాతం, సీఏసీ 0.02 శాతం నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు..
ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 0.55 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.44 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.35 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.15 శాతం లాభంతో ఉండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ 0.62 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.23 శాతం నష్టాలతో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 0.24 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్లో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 5,236 కోట్ల విలువైన స్టాక్స్, డీఐఐలు రూ. 1,014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.98 నుంచి 1.02 కు పెరిగింది.
- విక్స్ 7 శాతం తగ్గి 12.90 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 1.26 పైసలు బలపడి 90.26 వద్ద ఉంది.
- అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.17 శాతం పెరిగి 68.11 డాలర్ల వద్ద ఉంది.
భారత్, యూఎస్‌ల మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం మార్కెట్ ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.