అక్షరటుడే, హైదరాబాద్: Feb 04 Gold Prices | బంగారం, వెండి ధరల్లో Silver Prices చోటుచేసుకుంటున్న మార్పులు దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పడిపోయిన గోల్డ్ రేట్లు మళ్లీ ఎగబాకడం ప్రారంభించాయి. మంగళవారం నుంచి పెరుగుదల దిశగా కదిలిన ధరలు బుధవారం కూడా స్వల్పంగా పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, అమెరికా–ఇండియా మధ్య ట్రేడ్ డీల్‌పై వచ్చిన సానుకూల సంకేతాలు, డాలర్ బలపడటం వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం పెరగడంతో కొంతమంది పెట్టుబడిదారులు బంగారం నుంచి ఈక్విటీల వైపు మళ్లుతున్నప్పటికీ, సురక్షిత పెట్టుబడిగా గోల్డ్‌కు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.
Feb 04 Gold Prices | ధరలు పైపైకి..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు Gold Prices చూస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,53,940గా నమోదైంది. నిన్న రూ.1,53,930 వద్ద ఉండగా స్వల్పంగా పెరిగింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,110గా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతుండటం గమనార్హం. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,55,680గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ.1,42,710 వద్ద ట్రేడవుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,940 కాగా 22 క్యారెట్లు రూ.1,41,110 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,090గా నమోదవగా 22 క్యారెట్ల ధర రూ.1,41,260గా ఉంది. నగరానికో ధర ఉండటానికి స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, డిమాండ్-సప్లై పరిస్థితులు కారణమవుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
మరోవైపు వెండి ధరల్లో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతుండగా.. మంగళవారం ఇది రూ.2.80 లక్షల వద్ద ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,99,900గా నమోదైంది. ఇదే ధర విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా కొనసాగుతోంది. చెన్నైలో Chennai కూడా కిలో వెండి రూ.2,99,900 వద్ద ఉండగా బెంగళూరులో మాత్రం రూ.2,79,900గా ఉంది. పరిశ్రమల అవసరాలు, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ విలువ మార్పులు వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మొత్తంగా చూస్తే బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టగా వెండి స్వల్పంగా తగ్గడం మార్కెట్లో మిశ్రమ ధోరణిని సూచిస్తోంది.