అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market Crash | గ్రీన్‌లాండ్ విషయంలో యూఎస్, ఈయూ మధ్య ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతోపాటు అమెరికా అధ్యక్షుడు కొత్తకొత్త టారిఫ్‌లను ప్రకటిస్తుండడంతో వాణిజ్య అస్థిరతలు పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లు (global markets) నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎఫఐఐల నిరంతర అమ్మకాలు, రూపాయి బలహీనత. ఎఫఐఐల అమ్మకాలతో మన మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. చివరి గంటలో బేర్ గుప్పిట్లో చిక్కి మార్కెట్ విలవిల్లాడింది.
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 39 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 47 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి క్రమంగా సెన్సెక్స్ (Sensex) పతనమైంది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 1,244 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో మొదలై 5 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 414 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 1,065 పాయింట్ల నష్టంతో 82,180 వద్ద, నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 25,232 వద్ద స్థిరపడ్డాయి. బీఎసఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ఒక్కటి, నిఫ్టీ 50 ఇండెక్స్‌లో మూడు స్టాక్స్ మాత్రమే పాజిటివ్‌గా ముగియడం గమనార్హం.
Indian Stock Market Crash | అన్ని సెక్టార్లలో సెల్లాఫ్..
అన్ని సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎసఈలో రియాలిటీ ఇండెక్స్ 5.21 శాతం పడిపోగా.. సర్వీసెస్ ఇండెక్స్ 2.89 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.76 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.71 శాతం, ఇండస్ట్రియల్ 2.56 శాతం, టెలికాం 2.42 శాతం, ఆటో 2.36 శాతం, ఇన్‌ఫ్రా 2.31 శాతం, పవర్ 2.23 శాతం, ఐటీ 2.16 శాతం, కమోడిటీ 2.12 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.74 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.52 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.57 శాతం నష్టంతో ముగిశాయి.
Indian Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎసఈలో నమోదైన కంపెనీలలో 780 కంపెనీలు లాభపడగా 3,503 స్టాక్స్ నష్టపోయాయి. 119 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 65 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 713 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 13 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 9.37 లక్షల కోట్లు హరించుకుపోయింది.