ePaper
More
    Homeబిజినెస్​Indian stock market | ‘ఆపరేషన్‌ సింధూర్‌’కు స్టాక్‌ మార్కెట్‌ మద్దతు.. లాభాలతో ముగిసిన సూచీలు

    Indian stock market | ‘ఆపరేషన్‌ సింధూర్‌’కు స్టాక్‌ మార్కెట్‌ మద్దతు.. లాభాలతో ముగిసిన సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indian stock market | ఆపరేషన్‌ సింధూర్‌ (Operation sindoor)కు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (domestic stock market) మద్దతుగా నిలిచింది. సూచీలు బుధవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగినా లాభాలతో ముగిశాయి. భారత్‌ (Bharath), పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉదయం 693 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌, 146 పాయింట్ల నష్టంతో నిఫ్టీ(Nifth) ప్రారంభమై తొలి రెండు గంటలు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగాయి. ఆ తర్వాత సెన్సెక్స్‌(Sensex) 80,465 నుంచి 80,770 పాయింట్ల రేంజ్‌లో, నిఫ్టీ 24,330 నుంచి 24,430 పాయింట్ల రేంజ్‌లో రోజంతా కదలాడాయి. చివరికి సెన్సెక్స్‌ 105 పాయింట్ల లాభంతో 80,746 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 24,414 వద్ద స్థిరపడ్డాయి.

    బీఎస్‌ఈ(BSE)లో 2,206 కంపెనీలు లాభపడగా 1,683 స్టాక్స్‌ నష్టపోయాయి. 157 కంపెనీలు ఫ్లాట్‌గా ఉన్నాయి. 61 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 138 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 5 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌(Lower circuit)ను తాకాయి.

    Indian stock market | అన్ని సెక్టార్లలో ర్యాలీ..

    ఎఫ్‌ఎంసీజీ(FMCG) మినహా అన్ని సెక్టార్ల స్టాక్స్‌ రాణించాయి. బీఎస్‌ఈ ఆటో ఇండెక్స్‌ 1.74 శాతం పెరిగింది. మెటల్‌, రియాలిటీ, ఇన్‌ఫ్రా(Infra) ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభపడ్డాయి. పవర్‌, ఎనర్జీ, పీఎస్‌యూ, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీలు కూడా లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌(Midcap) ఇండెక్స్‌ 1.36 శాతం లాభపడగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.16 శాతం, లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0. 24 శాతం పెరిగాయి.

    Indian stock market | Top Gainers..

    బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 18 కంపెనీలు లాభాలతో ముగియగా 12 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్‌(Tata motors) అత్యధికంగా 5.05 శాతం లాభపడగా.. బజాజ్‌ ఫైనాన్స్‌ 2.14 శాతం పెరిగింది. ఎటర్నల్‌, ఎంఅండ్‌ఎం, అదాని పోర్ట్స్‌, టాటా స్టీల్‌, టైటాన్‌(Titan), పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్‌లు ఒక శాతానికిపైగా పెరిగాయి.

    Indian stock market | Top Losers..

    ఆసియా పెయింట్‌(Asia paint) 3.53 శాతం క్షీణించింది. సన్‌ఫార్మా, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌ ఒక శాతానికిపైగా నష్టపోయాయి.

    More like this

    Birkur | కుక్కల బెడదను నివారించాలి.. బీజేపీ నాయకుల విన్నపం

    అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ మండల కేంద్రంలో కుక్కల బెడదను నివారించాలని బీజేపీ నాయకులు(Bjp Birkur) డిమాండ్​...

    Khairatabad Ganesh | గంగమ్మ ఒడికి ఖైరతాబాద్​ గణేశుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khairatabad Ganesh | హైదరాబాద్​ (Hyderabad) లో వినాయకుడి నిమజ్జనం ఘనంగా సాగుతోంది. వేలాది...

    Uttar Pradesh | గ్రామంలో విషాదం.. పసికందును ఎత్తుకెళ్లి నీటి డ్రమ్ములో పడేసిన కోతులు, త‌ర్వాత ఏమైందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది....