Homeఅంతర్జాతీయంNew York | న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో భారతీయ యువకుడి వినూత్న ప్రపోజల్.. ఫిదా అయిన...

New York | న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో భారతీయ యువకుడి వినూత్న ప్రపోజల్.. ఫిదా అయిన ప్రేయ‌సి

ఒక భారతీయ యువకుడు తన ప్రేమను ప్రియురాలికి వ్య‌క్త‌ప‌ర‌చేందుకు చేసిన ప‌ని ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ మధ్యలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : New York | అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయ యువకుడు తన ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తం చేయాల‌ని అనుకున్నారు. ఇందుకుగాను బాలీవుడ్ స్టైల్‌లో ప్రపోజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

బాలీవుడ్ సినిమా స్టయిల్‌లో చేసిన ఈ రొమాంటిక్ ప్రపోజల్‌కి వేదికగా నిలిచింది అమెరికా (America)లోని ప్రసిద్ధ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ (New York Times Square). పార్థ్ మానియార్ అనే యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ శ్రేయా సింగ్‌కు ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలని భావించి ఒక ప్లాన్ వేశాడు. అతడి ప్లాన్ ప్రకారం శ్రేయా కళ్లకు గంతలు కట్టి ఆమె స్నేహితులు ఆమెను టైమ్స్ స్క్వేర్‌కు తీసుకెళ్లారు.

New York | ఆ క్ష‌ణం అపురూపం..

అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాక్‌డ్రాప్‌, డ్యాన్స్ ట్రూప్‌తో బాలీవుడ్ సినిమా శైలిలో పార్థ్ డ్యాన్స్ చేస్తూ శ్రేయా ముందుకు వచ్చాడు. టైమ్స్ స్క్వేర్ మధ్యలో ప్రేమను వ్యక్తం చేస్తూ ఆ క్షణాన్ని మరింత గుర్తుండిపోయేలా మార్చాడు. డ్యాన్స్ మధ్యలో పార్థ్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరి డ్యాన్స్‌లో పాల్గొన్నారు. శ్రేయా కళ్లకు గంతలు తీసినపుడు ఆమె ముందున్న వాతావరణం, ప్రపోజ్ కోసం చేసిన ఏర్పాట్లు చూసి ఆమె భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు పెట్టుకుని పార్థ్‌ను ఆలింగనం చేసుకుంది.

ఈ రొమాంటిక్‌ ప్రపోజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో దుమ్మురేపుతోంది. నెటిజన్లు ఇది బాలీవుడ్ సినిమాలో చూసే రొమాన్స్‌ను తలపిస్తోందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా సీన్‌లా ఉంది,ఇంత పర్ఫెక్ట్ ప్రపోజల్ ఎవరు ప్లాన్ చేస్తారు, గర్ల్ ఎంత ఎమోషనల్ అయ్యిందో చూడండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రపోజ్ కోసం టైమ్స్ స్క్వేర్‌ను ఎంచుకోవడం, స్నేహితులు–కుటుంబ సభ్యులతో కలిసి సర్ప్రైజ్ ఏర్పాటు చేయడం, బాలీవుడ్ డ్యాన్స్‌ తో ప్రేమను వ్యక్తం చేయడం ఇవన్నీ ఈ యువ జంట ప్రేమను మరింత ప్రత్యేకంగా నిలిపాయి.ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ట్విట్టర్, యూట్యూబ్‌లలో లక్షలాది వ్యూస్ సాధిస్తోంది. ప్రియురాలికి ఇలా ఫుల్ సెలబ్రేషన్‌తో చేసిన ప్రేమ ప్రపోజల్‌ని ఇప్పుడు ప్రపంచమంతా అభినందిస్తోంది.

Must Read
Related News