Homeఅంతర్జాతీయంSaudi Lottery | సౌదీలో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు.. లాటరీలో రూ.61 కోట్లు సొంతం

Saudi Lottery | సౌదీలో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు.. లాటరీలో రూ.61 కోట్లు సొంతం

సౌదీ అరేబియాలో మరో భారతీయుడు జాక్​పాట్ తగిలింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి లాటరీలో ఏకంగా రూ.61 కోట్లు గెలుచుకున్నాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Saudi Lottery | సౌదీ అరేబియాలో మరో భారతీయుడు జాక్​పాట్ తగిలింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి లాటరీలో ఏకంగా రూ.61 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మనదేశంలో లాటరీలపై నిషేధం ఉంది. అయితే సౌదీలో మాత్రం వీటికి భారీ క్రేజ్​ ఉంటుంది. దీంతో అక్కడ పని చేస్తున్న భారత్​కు చెందిన చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని లాటరీ టికెట్లు కొంటుంటారు. ఈ క్రమంలో తాజాగా కేరళ (Kerala)కు చెందిన ఓ వ్యక్తి రూ.61.37 కోట్లు గెలుచుకున్నారు.

Saudi Lottery | అబుదాబిలో..

కేరళకు చెందిన పీవీ రాజన్​ సౌదీలోని ఓ కంపెనీలో సూపర్​వైజర్​గా పని చేస్తున్నాడు. 15 ఏళ్లుగా ఆయన లాటరీ టికెట్లు (Lottery Tickets) కొనుగోలు చేస్తున్నాడు. అబుదాబి వేదికగా నిర్వహించే ‘బిగ్‌ టికెట్‌ డ్రా సిరీస్‌ 281’ లాటరీ టికెన్​ను నవంబర్​ 9న కొనుగోలు చేశాడు. డిసెంబర్​ 3న లక్కీ డ్రా తీయగా.. పీవీ రాజన్‌ విజేతగా నిలిచాడు. దీంతో ఆయన రూ.61.37 కోట్లు (25 మిలియన్ల దిర్హామ్‌లు) గెలుచుకున్నాడు. తాను గెలిచిన ఈ డబ్బుల్ని తన 15 మంది సహచరులతో పంచుకుంటానని రాజన్ చెప్పాడు.

Saudi Lottery | డ్రా తీసిన భారతీయుడు

లాటరీ గత సీరిస్​లో​ సైతం భారతీయుడు (Indian) విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన శరవణన్ గత నెల 3న తీసిన లాటరీలో 25 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు. దీంతో ఆయన తాజాగా నిర్వాహకులు రిచార్డ్‌, బౌచ్రా సమక్షంలో లక్కీ డ్రా (Lucky Draw) తీశాడు. రాజన్​కు లాటరీ తగిలినట్లు నిర్వాహకులు ఫోన్​ చేసి చెప్పారు. దీంతో మనోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘బిగ్‌ టికెట్‌ అబుధాబి’ ప్రతినెల లాటరీ నిర్వహిస్తుంది. గ్రాండ్​ ప్రైజ్​తో పాటు కన్సోలేషన్​ బహుమతులు సైతం అందిస్తుంది. ఈ సారి పది మందికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వగా.. అందులో సైతం ముగ్గురు భారతీయులు ఉండటం గమనార్హం.

Must Read
Related News