Homeజిల్లాలుకామారెడ్డిIndian Constitution Day | ఉమ్మడి జిల్లాలో భారత రాజ్యాంగ దినోత్సవం

Indian Constitution Day | ఉమ్మడి జిల్లాలో భారత రాజ్యాంగ దినోత్సవం

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Indian Constitution Day | భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా (joint Nizamabad district) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పాఠశాలల్లో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు.

Indian Constitution Day | బాన్సువాడ మండలంలో..

బాన్సువాడ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బాన్సువాడ పట్టణంలోని (Banswada town) డాక్టర్ బీఆర్ అంబేడ్క్​ర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగం అందించిన హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. అంబేడ్కర్​ చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సంఘం కో–ఆర్డినేటర్ అంబర్ సింగ్, మాజీ వార్డు సభ్యులు శ్రీనివాస్, లాయక్, అక్బర్, నాయకులు మొహమ్మద్ నసీముద్దీన్, షఫియుద్దీన్, యూనుస్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Indian Constitution Day | ఆలూర్‌ మండలంలో..

ఆర్మూర్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాల మహానాడు ఆధ్వర్యంలో ఆలూర్‌లో అంబేడ్కర్​ విగ్రహానికి (Ambedkar statue) పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాల మహానాడు ఆలూర్ మండల అధ్యక్షులు అగ్గు క్రాంతి, భాస్కర్, సజన్, మహిపాల్, నరహరి, సురేష్, స్వయన్న, బీజేపీ ఓబీసీ ఆలూర్ మండలాధ్యక్షుడు నడిసరం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Indian Constitution Day | కమ్మర్​పల్లి మండలంలో..

కమ్మర్​పల్లి: భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, విధుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ తెలిపారు. కోనాపూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో (Konapur Village High School) భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బుధవారం ఉపాధ్యాయులు, విద్యార్థులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్​ఎం రాంప్రసాద్, ఎంపీవో సదాశివ్, కోనాపూర్ పంచాయతీ సెక్రెటరీ నవీన్, ఉపాధ్యాయులు ధర్మేందర్, అరవింద్, గీత, హైమావతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Indian Constitution Day | బాల్కొండ ఉన్నత పాఠశాలలో

బాల్కొండ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (Zilla Parishad High School) రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంఈవో బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యాంగ ప్రాధాన్యత, విద్యార్థుల బాధ్యత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్​ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, మురళి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Indian Constitution Day | పాల్వంచలో..

పాల్వంచ: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాల్వంచ గ్రామంలో డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Must Read
Related News