అక్షరటుడే, వెబ్‌డెస్క్: India women vs Pakistan women | పాక్ మహిళలపై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది.
ప్రపంచ కప్ 2025లో పాకిస్తాన్ పై 88 పరుగుల తేడాతో హర్మన్ ప్రీత్ Harmanpreet నేతృత్వంలోని భారత్ జట్టు గెలుపొందింది. మహిళల ప్రపంచ కప్ 2025 (World Cup 2025) లో భారత్‌కు ఇది రెండో విజయం.
పాక్ Pakistan మహిళలు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో టీమిండియా Team India మొదట బ్యాటింగ్ చేపట్టింది.
హర్లీన్ డియోల్(46), రిచా ఘోష్(35, నాటౌట్), జెమిమా రోడ్రిగ్యూస్(32), ప్రతీక రావల్(31), దీప్తి శర్మ(25), స్మృతి మందాన(23), స్నేహ్ రాణా(20) రాణించడంతో భారత మహిళల జట్టు 247 రన్స్ చేసింది.
India women vs Pakistan women | పేలవంగా బ్యాటింగ్..
248 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మహిళలకు దీప్తి శర్మ Deepti Sharma, క్రాంతి గౌడ్ Kranti Goud, స్నేహ్ రాణా Sneh Rana ముచ్చెమటలు పట్టించారు. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ చెరో 3 వికెట్లు తీశారు. స్నేహ్ రాణా 2 వికెట్లు తీసింది.
పాకిస్థాన్ జట్టులో సిద్రా అమీన్(81) మినహా మిగతావారు బ్యాటింగ్లో పూర్తిగా విఫలమయ్యారు. నటాలియా పర్వేజ్ 33 రన్స్ చేసింది.
సిద్రా నవాజ్ 14 రన్స్ మాత్రమే చేయగలిగింది. పాక్ జట్టులో ఇద్దరు డకౌట్ అయ్యారు. మిగతావారు సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు.