HomeజాతీయంPM Modi | భారత్​ శాంతి వైపే ఉంటుంది : ప్రధాని మోదీ

PM Modi | భారత్​ శాంతి వైపే ఉంటుంది : ప్రధాని మోదీ

భారత్ ఎప్పుడు శాంతి వైపే ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్​ భారత పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | భారత్ ఎప్పుడు శాంతి వైపే ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్​ భారత పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌ (Hyderabad House)లో భారత్‌ – రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. ఆరంభంలోనే పుతిన్‌తో శాంతి గురించి ప్రధాని మాట్లాడారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదం దౌత్య, శాంతి చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine War)లో భారత్‌ తటస్థంగా లేదని చెప్పారు. భారత్‌ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ శాంతి మార్గంలోకి వస్తాయని ఆకాంక్షించారు.

PM Modi | గాంధీకి నివాళి

పుతిన్​ ముందుగా రాజ్​ఘాట్​లోని మహాత్మ గాంధీ (Mahatma Gandhi) సమాధికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన రాష్ట్రపతి భవన్​ (Rashtrapati Bhavan)కు చేరుకున్నారు. పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ–పుతిన్​ (Modi-Putin) భేటీ అయ్యారు. పుతిన్‌ విజన్‌కు భారత్‌, రష్యా ఒప్పందాలే ఉదాహరణ ప్రధాని పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందన్నారు.

తనను భారతదేశానికి ఆహ్వానించినందుకు ప్రధాని మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి పుతిన్ మాట్లాడుతూ, శాంతియుత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం ఇరు దేశాల అధినేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Must Read
Related News