అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ శుభవార్త అందింది. టీ20 జట్టు వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులో చేరాడు. మెడ పట్టేసిన గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్‌లకు దూరమైన గిల్, ఫిట్‌నెస్ టెస్టులు విజయవంతంగా పూర్తి చేసి వెంటనే మళ్లీ అందుబాటులోకి వచ్చాడు.
డిసెంబర్ 9న కటక్‌లో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌కు ముందురోజు రాత్రి 9 గంటలకు అతను భువనేశ్వర్ చేరుకోవడంతో, తొలి మ్యాచ్‌లోనే అతను ఆడే విషయంలో క్లారిటీ ఇచ్చింది. కోల్‌కతా టెస్ట్ సందర్భంగా గిల్ (Shubman Gill) మెడకి గాయం కావడంతో సిరీస్ మొత్తాన్ని మిస్ అయ్యాడు. టీ20లకు ఎంపికైనప్పటికీ, ఫిట్‌నెస్ మీద స్పష్టత లేక బీసీసీఐ వేచి చూసింది.
Team India | ఫుల్ జోష్‌లో…
చివరకు బెంగళూరులోని బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి చేసిన గిల్ తిరిగి జట్టులో చేరాడు. “గిల్ పూర్తిగా ఫిట్. అతను పరుగుల కోసం ఆకలితో ఉన్నాడు” అని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ధృవీకరించాడు. వన్డే జట్టులో ఉన్న టీ20 ఆటగాళ్లు ఆదివారం ఉదయం వైజాగ్ నుండి చార్టర్డ్ ఫ్లైట్‌లో భువనేశ్వర్ చేరుకోగా, గిల్ మాత్రం రాత్రి చేరుకున్నాడు. ఇప్పటికే కటక్ బారాబతి స్టేడియం (Cuttack Barabati Stadium)లో టీమిండియా సన్నాహకాలు మొదలయ్యాయి. స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ముందుగానే చేరి ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్ నిర్వహించాడు.
సాయంత్రం జరిగిన పాండ్యా (Hardik Pandya) ప్రాక్టీస్‌ను పూర్తిగా క్లోజ్డ్ డోర్స్‌లో నిర్వహించడం విశేషం. గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన ఫామ్, ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే సిరీస్‌లో పాండ్యా కీలక పాత్ర పోషించనుండటంతో ఈ ప్రాక్టీస్ సెషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని భావిస్తున్నారు. గిల్ తిరిగి రావడం, పాండ్యా ప్రాక్టీస్‌తో టీమిండియా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాని వైట్ వాష్ చేయలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ.