Homeక్రీడలుIND vs SA | ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్.. రికార్డుల మోత మోగించిన 23 ఏళ్ల...

IND vs SA | ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్.. రికార్డుల మోత మోగించిన 23 ఏళ్ల జైస్వాల్‌!

IND vs SA | టెస్ట్ లో భార‌త్‌ని వైట్ వాష్ చేసిన సౌతాఫ్రికాకి వన్డేలో గ‌ట్టిగా ఇచ్చిప‌డేశారు మనవాళ్లు. రోహిత్, కోహ్లీ రాక‌తో స్ట్రాంగ్ అయిన టీమిండియా జ‌ట్టు మూడో వ‌న్డేలో ఘ‌న విజ‌యం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs SA | టెస్ట్ సిరీస్‌లో భార‌త్‌ని India క్లీన్ స్లీప్ చేసిన సౌతాఫ్రికాకి వ‌న్డే ఫార్మాట్‌లో గ‌ట్టిగానే ఇచ్చిప‌డేసింది. విశాఖలో శనివారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ప్రోటీస్ నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ 10.1 ఓవర్లు మిగిలి ఉండగానే అద్భుతంగా ఛేజ్ చేసింది. ఈ విజయానికి యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అజేయ శతకం రూపంలో పెనుముద్ర వేశాడు.

23 ఏళ్ల జైశ్వాల్ 121 బంతుల్లో 116 పరుగులతో రాణించి, 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో దూకుడుగా ఆడాడు. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 155 బంతుల్లో 155 పరుగులు, కోహ్లీతో రెండో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

IND vs SA | ప్ర‌తీకారం తీర్చుకున్నారు.

2023లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జైశ్వాల్ Jaiswal ఈ సిరీస్‌కు ముందు కేవలం ఒకే వన్డే మ్యాచ్ ఆడినా, టెస్టులు (28), టీ20లు (23) ఆడుతూ ఇప్పటికే నమ్మదగ్గ ఆటగాడిగా తనను నిరూపించుకున్నాడు.

తాజాగా తన నాలుగో వన్డేలోనే శతకం నమోదు చేసి, 23 ఏళ్ల వయసులో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన అరుదైన భారత ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ తర్వాత అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆరో భారత క్రికెటర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకోగా, మూడో వన్డేలో అద్భుత శతకం కొట్టిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

తొలుత నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన జైశ్వాల్.. ఆ త‌ర్వాత వేగం పెంచాడు. 111 బంతుల్లో మూడంకెల మార్కు అందుకున్న 23 ఏళ్ల జైశ్వాల్‌కు ఇది నాలుగో వన్డే మ్యాచ్ కాగా ఎట్ట‌కేల‌కి తొలి వన్డే శతకం సాధించాడు. 121 బంతుల్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కోహ్లీ 45 బంతుల్లో 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో టీమిండియా 39.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కానీ తాజాగా రోహిత్, కోహ్లీ Kohliలాంటి సీనియర్ల రాకతో భారత్.. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది.

Must Read
Related News