అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs NZ | కివీస్‌తో జరిగిన మొదటి టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం (జనవరి 21) జరిగిన ఈ మ్యాచ్ లో 48 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
IND vs NZ | అభిషేక్ శర్మ మెరుపులు
మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 238 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (10), ఇషాన్ కిషాన్ (8) ఇలా వచ్చి అలా వెళ్లడంతో జట్టుకు ఆరంభం కలిసి రాలేదు. 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దుస్థితి జట్టుది. ఈ క్రమంలో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ(84) మైదానంలో చెలరేగిపోయాడు. సూర్య(32) సైతం దుమ్ముదులిపాడు.
కాగా, మిడిల్ ఓవర్స్ లో న్యూజిలాండ్ పుంజుకోవడంతో భారత జట్టు 185 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. అదే సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన రింకూ సింగ్ 20 బంతుల్లో 44 పరుగులు చేయడంతో భారత్ ఖాతాలోకి భారీ స్కోర్ చేరింది.
భారీ లక్ష్య ఛేదనతో తదుపరి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే కాన్వేను డకౌట్ చేసి, పెవిలియన్‌కు పంపాడు. రద్దీన్ రవీంద్ర(1) ను ఔట్ చేసి హార్దిక్ పాండ్య రెండో వికెట్ అందించాడు.
ఈ క్రమంలో న్యూజిలాండ్‌ను ఆదుకునే బాధ్యత రాబిన్సన్, గ్లెన్ ఫిలిప్స్ పై పడింది. ఈ జోడీ భారీ షాట్లతో స్కోర్‌ను పెంచేందుకు చూసినా.. వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్లోనే వారిని విడదీసి, రాబిన్సన్(21)ను ఔట్ చేశాడు.
అయినా చాప్ మాన్ (39) తో కలిసి ఫిలిప్స్ మరో భాగస్వామ్యాన్ని కొనసాగించాడు. దూకుడుగా ఆడుతున్న పిలిప్స్( 78)ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో కివీస్ చతికిలబడింది. చివర్లో మిచెల్, సాంట్నర్ తమ బ్యాటింగ్‌తో మురిపించినా.. జట్టును విజయం వరకు తీసుకెళ్లలేకపోయారు. భారత బౌలర్లలో శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టారు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ తీసుకున్నారు.