Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar project | నిజాంసాగర్​లోకి పెరిగిన ఇన్​ఫ్లో

Nizamsagar project | నిజాంసాగర్​లోకి పెరిగిన ఇన్​ఫ్లో

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar project | నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన వర్షాలకు జలాశయంలోకి వరద పెరిగింది. ప్రాజెక్టులోకి ఆదివారం నాలుగు వేల క్యూసెక్కుల వరద నీరు రాగా.. సోమవారం సాయంత్రానికి 6,070 క్యూసెక్కులకు పెరిగినట్లు ఏఈలు సాకేత్, అక్షయ్ కుమార్ తెలిపారు.

Nizamsagar project | ఐదు టీఎంసీలకు పెరిగిన నీటిమట్టం

నిజాంసాగర్​ ప్రాజెక్టు నీటిమట్టం ఐదు టీఎంసీలకు పెరిగింది. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1405. 00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1392.16 అడుగుల (5.067 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాగా.. ఎగువ భాగం నుంచి 6070 క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లోగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో రోజురోజుకు నీటి నిల్వ పెరుగుతుండడం, ఎక్కువ నుంచి ఇన్​ఫ్లో వచ్చి చేరుతుండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింత ఇన్​ఫ్లో పెరిగి ప్రాజెక్టు నిండితే వానాకాలం పంటల సాగుకు ఎలాంటి ఢోకా ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.