అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | కాంగ్రెస్ పార్టీ (Congress Party), సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం సీపీఐ సభలో మాట్లాడుతూ.. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ను బ్రిటిష్ పౌరుడు స్థాపించారని పేర్కొన్నారు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఐఎన్‌సీ “ఇటలీ నేషనల్ కాంగ్రెస్” గా రూపాంతరం చెందిందన్నారు. .
Bandi Sanjay | ప్రజలు తిరస్కరిస్తున్నారు
MGNREGA పేరు గురించి కాంగ్రెస్ ఏడుస్తోంది, కానీ తాము మహాత్మా గాంధీ నిజమైన కోరిక గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీజీ కోరుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ను పదే పదే తిరస్కరించడం ద్వారా, ప్రజలు గాంధీజీ దార్శనికతను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఓటు బ్యాంకుల కోసం భారతీయులను కులం, మతం ఆధారంగా విభజించడం ద్వారా కాంగ్రెస్ మనుగడ సాగిస్తుందని విమర్శించారు.
ప్రధాని మోదీ (Prime Minister Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం “సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్” లక్ష్యంగా పని చేస్తోందన్నారు. గృహనిర్మాణం, రేషన్లు, గ్యాస్ – మతంతో సంబంధం లేకుండా పేదలకు చేరుతుందన్నారు. కాంగ్రెస్ 70 సంవత్సరాలుగా పెంచి పోషించిన బానిస మనస్తత్వాన్ని తాము తొలగిస్తున్నట్లు తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీలో రాజకీయాలపై కొత్త కోర్సును చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అందులో మొదటి విద్యార్థి సీఎం రేవంత్ రెడ్డి అయి ఉండాలని ఎద్దేవా చేశారు.