అక్షరటుడే, ఇందూరు/నిజామాబాద్ సిటీ: Panchayat Elections | గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ డివిజన్లో 8 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఉత్సాహంగా ఓటర్లు క్యూలైన్లలో నిలబడి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలీసుశాఖ (Nizamabad Police) నుంచి సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను సైతం మోహరించారు.

Panchayat Elections | ఉదయం 11 గంటల వరకు..
ఆదివారం ఉదయం 11 గంటలకు వరకు 49.13 శాతం ఓట్లు పోలయ్యాయి. ధర్పల్లి మండలంలో 53.59 శాతం, డిచ్‌పల్లిలో(Dichpally) 35.36 శాతం, ఇందల్వాయిలో 50.45 శాతం, జక్రాన్‌పల్లిలో 55.16 శాతం, మాక్లూర్‌లో 56.26, నిజామాబాద్ రూరల్‌లో 60.28శాతం, సిరికొండలో 38.49 శాతం ఓట్లు పోలయ్యాయి.
Panchayat Elections | పోలింగ్ సరళిని పరిశీలించిన పోలీస్ కమిషనర్
రెండో విడత ఎన్నికల్లో భాగంగా మోపాల్, డిచ్పల్లి మండంలోని కంజర, కులాస్పూర్, ఘన్పూర్, ధర్మారం (బి) గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రాలను సీపీ సాయి చైతన్య పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలన్నారు. సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సీఐ చందర్ రాథోడ్, ఎస్సైలు మహేశ్, ఆరిఫ్, సుమలత , ఆర్వో అధికారులు శ్రీనివాస్, షేక్ మస్జీద్ , రాజ నర్సయ్య, మధుసూదన్ ఇతర అధికారులు ఉన్నారు.