Homeతాజావార్తలుStock Market | మూడో రోజూ నష్టాల్లోనే..

Stock Market | మూడో రోజూ నష్టాల్లోనే..

ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో బుధవారం రోజంతా ప్రధాన సూచీలు నష్టాలతోనే సాగాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజు నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 31 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | సూచీలను పైకి తీసుకువెళ్లేందుకు డీఐఐలు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఎఫ్‌ఐఐ(FII)లతో పాటు రిటైల్‌ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుండడంతో మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. వరుసగా మూడో రోజూ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి.

బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 12 పాయింట్ల లాభంతో ప్రారంభమై 119 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా ఇంట్రాడే గరిష్టాలనుంచి 506 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 28 పాయింట్ల నష్టంతో ప్రారంభమె 62 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. గరిష్టాలనుంచి 175 పాయింట్లు నష్టపోయింది. చివరలో మార్కెట్లు కాస్త కోలుకుని స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌(Sensex) 31 పాయింట్ల నష్టంతో 85,106 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 25,986 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market | ఐటీ మినహా..

బీఎస్‌ఈలో ఐటీ(IT), బ్యాంకెక్స్‌ మినహా మిగిలిన అన్ని ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. ఐటీ ఇండెక్స్‌ 0.92 శాతం, బ్యాంకెక్స్‌ 0.19 శాతం పెరిగాయి. పీఎస్‌యూ బ్యాంక్‌(PSU bank) ఇండెక్స్‌ 3.25 శాతం, పీఎస్‌యూ 1.56 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 1.31 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 1.24 శాతం, ఇన్‌ఫ్రా 1.21 శాతం, ఆటో ఇండెక్స్‌ 1.12 శాతం, పవర్‌ 1.05 శాతం, క్యాపిటల్‌మార్కెట్‌ 1.05 శాతం నష్టపోయాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.95 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.43 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.33 శాతం నష్టంతో ముగిశాయి.

Stock Market | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,481 కంపెనీలు లాభపడగా 2,681 స్టాక్స్‌ నష్టపోయాయి. 154 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 85 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 289 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 11 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Stock Market | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో ఉండగా.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టీసీఎస్‌ 1.41 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.37 శాతం, ఇన్ఫోసిస్‌ 1.12 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.06 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.91 శాతం లాభపడ్డాయి.

Stock Market | Top losers..

బీఈఎల్‌ 2.13 శాతం, టైటాన్‌ 1.86 శాతం, ఎంఅండ్‌ఎం 1.79 శాతం, ఎన్టీపీసీ 1.72 శాతం, ఎస్‌బీఐ 1.69 శాతం నష్టపోయాయి.

Must Read
Related News