అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | భారతీయ స్టాక్ మార్కెట్ (Indian Stock Market) వరుసగా రెండో రోజు నష్టాలతోనే ముగిసింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో మంగళవారం రోజంతా ప్రధాన సూచీలు నష్టాలతోనే సాగాయి. చివరికి సెన్సెక్స్ 503 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
ముడి చమురు (Crude Oil) ధరలు పెరుగుతుండడం, రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తుండడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock mMarkets) నష్టాల బాటలో కొనసాగాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 316 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 85,053 నుంచి 85,553 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ (Nifty) 25,997 నుంచి 26,154 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 503 పాయింట్ల నష్టంతో 85,138 వద్ద, నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో 26,032 వద్ద స్థిరపడ్డాయి. ఆర్‌బీఐ మూడు రోజులల ద్రవ్య విధాన సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. మీటింగ్ తీర్మానాలు 5వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.
స్మాల్, లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఒత్తిడి..
బీఎస్‌ఈలో టెలికాం ఇండెక్స్ 0.65 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.45 శాతం పెరిగాయి. సర్వీసెస్ ఇండెక్స్ 1.03 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.78 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.67 శాతం, ఇన్‌ఫ్రా 0.55 శాతం, ఎనర్జీ 0.45 శాతం, పవర్ 0.42 శాతం, యుటిలిటీ ఇండెక్స్ 0.40 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.49 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.46 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం నష్టపోయాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 1,586 కంపెనీలు లాభపడగా 2,563 స్టాక్స్ నష్టపోయాయి. 167 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 106 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 249 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో ఉండగా.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఆసియా పెయింట్ 3.11 శాతం, మారుతి 0.83 శాతం, ఎయిర్‌టెల్ 0.59 శాతం, హెచ్‌యూఎల్ 0.55 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.54 శాతం లాభపడ్డాయి.
Top Losers : యాక్సిస్ బ్యాంక్ 1.29 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.25 శాతం, రిలయన్స్ 1.25 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.24 శాతం, బీఈఎల్ 1.01 శాతం నష్టపోయాయి.
