Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | ఆకట్టుకున్న ‘పెద్ద పట్నం’

Bodhan | ఆకట్టుకున్న ‘పెద్ద పట్నం’

అక్షరటుడే, బోధన్‌ : Bodhan | పట్టణంలోని శక్కర్‌ నగర్‌ (Shakkar Nagar) కాలనీ దేవిగల్లిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు (Navratri Celebrations) వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం దేవిమాత వద్ద పెద్దపట్నం బోనాల ఊరేగింపు నిర్వహించారు. నిజామాబాద్‌ (Nizamabad) జిల్లాకేంద్రానికి చెందిన నాని గౌడ్‌ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందూరు మాతంగి మహా బోనం, పెద్దపట్నంలో చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహా బోనం, పెద్దపట్నం నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.