అక్షరటుడే, నిజాంసాగర్:Indiramma Housing Scheme | సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)తోనే సాధ్యమవుతుందని పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పేర్కొన్నారు.
మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల(Indiramma’s houses) లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భీమ్రావు తదితరులు పాల్గొన్నారు.