అక్షరటుడే, ఇందూరు: CPM Nizamabad | మొరం అక్రమ రవాణాను అరికట్టాలని సీపీఎం నగర కమిటీ (CPM city committee) డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని సౌత్ తహశీల్దార్ కార్యాలయం (South Tahsildar office) ఎదుట సీపీఎం నాయకులు ధర్నాకు దిగారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగర శివారులోని నాగారం (Nagaram) రాజీవ్ స్వగృహ వెనక ప్రాంతంలో ఆదివారం నుంచి మొరం అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోందని వివరించారు. దీంతో స్థానికులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. గతంలోనూ ఇలా మొరం తవ్వకాలతో ఏర్పడిన గుంత కారణంగా ముగ్గురు చిన్నారులు మృతి చెందారని వారు వాపోయారు. వెంటనే తవ్వకాలను నిలిపివేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నగర కమిటీ కార్యదర్శి సుజాత, నగర కార్యవర్గ సభ్యులు నల్వాల నర్సయ్య, అనిత పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
