అక్షరటుడే, ఇందూరు : Former MLA Jeevan Reddy | కక్ష సాధింపులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమంగా కేసులు బనాయించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధం కొనసాగుతుందని విమర్శించారు.
నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో (BRS Party Office) శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఫార్ములా కారు రేసుకు సంబంధించి అది తప్పుడు కేసు అని వ్యాఖ్యానించారు. అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సఖ్యత ఎలా ఉందో బయటపడిందన్నారు. ఆ రెండు పార్టీల అంతర్గత ఒప్పందంతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచిందన్నారు.
Former MLA Jeevan Reddy | కేటీఆర్ అంటే రేవంత్‌రెడ్డికి కుళ్లు
దేశంలో పేరు గడించిన యువ నాయకుల్లో కేటీఆర్ (KTR) కూడా ఉంటారని.. అలాంటి పేరేన్నిక గన్న పొలిటీషియన్ పేరును పాడు చేసేందుకు రేవంత్‌రెడ్డి పట్టుబట్టారన్నారు. రాష్ట్రంలో శాడిస్టు సీఎం పాలన సాగుతోందన్నారు. కేటీఆర్ ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం అహర్నిషలు పనిచేస్తున్నారన్నారు. సీఎం చేసే పాడు పనులు కేటీఆర్‌కు ఆపాదించి కక్ష సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.
Former MLA Jeevan Reddy | తప్పుడు కేసులతో వేధింపులు..
బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటే ఫైటర్స్ ఫ్యామిలీ అని జీవన్‌రెడ్డి (Jeevan Reddy) పేర్కొన్నారు. రాష్ట్రంలో 60లక్షల బీఆర్ఎస్ సైన్యం ఉందన్నారు. కేసులకు బీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ బయపడలేదని చెప్పారు. ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నిలబడిందన్నారు. కేసీఆర్ (KCR) అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ముట్టుకున్న వైఎస్సార్, కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం నుంచి పారిపోయారన్నారు.
Former MLA Jeevan Reddy | జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం..
సీఎం గోబ్యాక్.. కేసీఆర్ కమ్‌బ్యాక్ అని గ్రామాల్లో అంటున్నారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) వార్ వన్‌సైడ్ అని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఫార్ములా కారు రేసు కేసు నుంచి కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Former MLA Jeevan Reddy | సుదర్శన్ రెడ్డిని జిల్లాలో తిరగనివ్వం..
అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లాలో సీనియర్ నాయకుడు, ప్రభుత్వసలహాదారు సుదర్శన్‌రెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యప్రకాష్, సుజిత్ సింగ్ ఠాకూర్, దండు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
