అక్షరటుడే, హైదరాబాద్ : Dussehra | దసరా అంటే పండుగ శోభ మాత్రమే కాదు, పిల్లలకు సరదా సెలవులు కూడా. అయితే, పిల్లలు ఇంట్లోనే ఉండటం, రోజంతా టీవీ లేదా మొబైల్‌తో గడపడం, లేదా ఎండల్లో ఆడుతూ ఆరోగ్యం పాడు చేసుకోవడం చూసి తల్లిదండ్రులకు టెన్షన్ పెరుగుతుంది. ఈ సెలవులను కేవలం విశ్రాంతి కోసమే కాకుండా, వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా, విజ్ఞానం పెంచుకునేలా మార్చాలి.
నైపుణ్యాలను పెంపొందించే కోర్సులు
సెలవుల్లో కొత్త నైపుణ్యాలు నేర్పించడం పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సెలవుల్లో పిల్లల ఆసక్తిని బట్టి ఏదైనా కొత్త కోర్సులో చేర్చడం మంచిది.
కళలు, సంగీతం : చిత్రలేఖనం, వాయిద్యాలు, పాటలు నేర్చుకోవడం వల్ల వారిలోని సృజనాత్మకత పెరుగుతుంది.
కంప్యూటర్ స్కిల్స్ : పెద్ద పిల్లలకి బేసిక్ కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్(Graphic Designing) లేదా వీడియో ఎడిటింగ్ లాంటివి నేర్పించడం ద్వారా భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది.
క్రీడలు : కరాటే, స్విమ్మింగ్(Swimming) వంటివి వారి శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణను పెంపొందిస్తాయి.
ఇతర భాషలపై పట్టుకోసం:
పిల్లలు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవడం చాలా అవసరం.
చదవడం, కథలు చెప్పడం
టీవీ, మొబైల్ ఫోన్ల(Mobile Phones)కు బదులుగా మంచి కథల పుస్తకాలను చదివే అలవాటు చేయండి. రోజూ ఒక కొత్త పుస్తకం చదవడం, లేదా వారికి కథలు చెప్పడం ద్వారా వారిలో కల్పనా శక్తి, భాషా పరిజ్ఞానం పెరుగుతాయి.సుడాకో లాంటివి నింపడం ద్వారా వారిలో ఆలోచన విధానం మెరుడుపడుతుంది. ఇది వారిలో ఆత్మవిశ్వాసం, ఆలోచనాశక్తిని పెంపొందిస్తుంది.
వంట చేయడం నేర్పించడం
పెద్ద పిల్లలకు వంట గదిలో చిన్న చిన్న వంటలు(Coocking) నేర్పించడం మంచి ఆలోచన. దీనివల్ల వారు స్వతంత్రంగా ఉండటం నేర్చుకుంటారు. అంతేకాకుండా, ఇది వారిలో బాధ్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఉదాహరణకు, సలాడ్ తయారు చేయడం, లేదా సాధారణ వంటలు నేర్పించవచ్చు.
ఈ విధంగా దసరా సెలవులను(Dussehra Holidays) కేవలం ఆటలకే కాకుండా, జ్ఞానాన్ని పెంచుకోడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది వారిని సరదాగా ఉంచుతూనే, భవిష్యత్తుకు ఉపయోగపడేలా తయారు చేస్తుంది.