అక్షర టుడే, ఆర్మూర్:BJP Armoor | ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి(MLA Rakesh Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకుడు వినయ్‌రెడ్డి(Congress leader Vinay Reddy)కి పరిపాటిగా మారిందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. రాకేశ్‌రెడ్డి చొరవతోనే ఆర్మూర్‌కు సమీకృత గురుకులం మంజూరైందని, ఈ విషయం అసెంబ్లీలో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారని గుర్తు చేశారు. ఇకనైనా, అనవసర వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ రాజు, పట్టణ అధ్యక్షుడు బాలు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్, మండలాధ్యక్షుడు వినోద్, గిరీష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
