అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | మండల, గ్రామ, వార్డుల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా (Draft Voter List), పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలు తెలియజేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.
కలెక్టరేట్లో (Nizamabad Collectorate) శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యంతరాలను ఈనెల 30వ తేదీ లోపు తెలియజేయాలని సూచించారు.
అనంతరం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని జరిపిన తర్వాత సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. అభ్యంతరాలను ఈనెల 30వరకు స్వీకరించి, 31న పరిష్కరిస్తామని తెలిపారు.
అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit), జడ్పీ సీఈవో సాయాగౌడ్ (ZP CEO Sayagoud), డీపీవో శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.