అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Navjot Singh Sidhu | మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu) కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ (Navjot Kaur Sidhu) కీలక వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూను ప్రకటిస్తే ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారన్నారు. ఏ పార్టీకి ఇవ్వడానికి తమ వద్ద డబ్బు లేదని, కానీ పంజాబ్‌ను బంఆరు రాష్ట్రంగా మార్చగలమని తెలిపారు. తాము ఎల్లప్పుడూ పంజాబ్ కోసం ఆలోచిస్తామన్నారు. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి తమ వద్ద రూ. 500 కోట్లు లేవు అన్నారు. రూ.500 కోట్లు ఇస్తే సీఎం కావొచ్చని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
Navjot Singh Sidhu | డబ్బు అడగలేదు
తమను ఇంతవరకు ఎవరు డబ్బు అడగలేదని కౌర్ చెప్పారు. కానీ రూ.500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు పంజాబ్ రాజకీయాల్లో (Punjab politics) తీవ్ర చర్చకు దారి తీశాయి. పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటికే ఐదుగురు నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వారు సిద్ధూను ముందుకు రానివ్వరని ఆమె చెప్పుకొచ్చారు. తన భర్త కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాలతో (Congress leader Priyanka Gandhi Vadra) బలంగా అనుబంధం కలిగి ఉన్నారని తెలిపారు.
Navjot Singh Sidhu | రాజకీయాలకు దూరంగా..
పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సిద్ధూ చాలా నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha elections) కూడా ప్రచారం చేయలేదు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సిద్ధూ క్రికెట్ వ్యాఖ్యాతగా రీ ఎంట్రీ ఇచ్చారు. క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి రావడం గురించి ఆయన మాట్లాడుతూ.. కాలమే చెబుతుంది అని గతంలో వ్యాఖ్యానించారు. తాను ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేశానని, అది తనకు ఎప్పుడూ వ్యాపారం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా 2027 పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.