అక్షరటుడే, కామారెడ్డి: Electricity Department | విద్యుత్ సమస్యల పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని తెలంగాణ విద్యుత్ వినియోగదారుల ఫోరం (Telangana Electricity Consumers Forum) ఛైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని సబ్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Electricity Department | ఫిర్యాదుల స్వీకరణ..
రైతుల నుంచి, విద్యుత్ వినియోగదారుల నుంచి ఫోరం ఛైర్మన్ నారాయణ ఫిర్యాదుల స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు సమస్యలు ఎదురైతే నేరుగా విద్యుత్ శాఖ అధికారుల (electricity department officials) వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని వెంటనే పరిష్కారం చూపుతామన్నారు.
Electricity Department | నిజామాబాద్లో..
నిజామాబాద్లో ఉన్న విద్యుత్ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని, వెసులుబాటు లేని వినియోగదారులు తమ సమస్యలను అప్లికేషన్ రూపంలో రాసి ఫొటో తీసి తమ వాట్సాప్ నంబర్లకు ఫిర్యాదు చేసినా వాటికి పరిష్కారం చూపుతామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఛైర్ పర్సన్ 8712481312, టెక్నికల్ మెంబర్ 8712481315, ఫైనాన్స్ మెంబర్ 8712481317, 4వ వార్డు సభ్యుడు 8712485207 నంబర్లకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు పంపవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఎస్ఈ రవీందర్, డీఈఈ కళ్యాణ్ చక్రవర్తి, విద్యుత్ శాఖ అధికారులు, రైతులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.