- Advertisement -
HomeతెలంగాణJadcharla MLA | చర్యలు తీసుకోకపోతే అరబిందో ఫార్మాను తగులబెడతా.. అధికారులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి...

Jadcharla MLA | చర్యలు తీసుకోకపోతే అరబిందో ఫార్మాను తగులబెడతా.. అధికారులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అల్టిమేటం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Jadcharla MLA | సొంత ప్రభుత్వంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబిందో ఫార్మా కంపెనీపై (Aurobindo Pharma Company) ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. శనివారం లోగా చర్యలు చేపట్టాలని అల్టీమేటం జారీ చేశారు.

లేకపోతే ఆదివారం తానే ఆ కంపెనీని తగలబెడతానని శుక్రవారం విడుదల చేసిన ఓ వీడియాలో హెచ్చరించారు. అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా, పలుమార్లు హెచ్చరించినా అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి (Muddireddypalli lake) కలుషిత జలాలను వదలడం ఆపడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తక్షణం చర్యలు తీసుకోవడానికి కాలుష్య నియంత్రణ మండలికి ఒకరోజు టైమ్ ఇస్తున్నానన్నారు. ఈలోగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Pollution Control Board) చర్యలు తీసుకోకపోతే ఆదివారం 11 గంటలకు అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి ఆ కంపెనీని తానే తగులబెడతానని హెచ్చరించారు.

- Advertisement -

Jadcharla MLA | కలుషిత జలాలతో ముప్పు

పోలేపల్లి ఫార్మా సెజ్ లోని అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతున్న కారణంగా పంటలు పండడం లేదని, చెరువులో ఉన్న చేపలు కూడా చనిపోతున్నాయని అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనిపై తాను గతంలోనే అసెంబ్లీలో (Assembly) ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయంలో అధికారులకు, అరబిందో ఫార్మాకు మధ్య ఏ లాలూచీ ఉందో తనకు తెలియదన్నారు.

మరోసారి కలుసిత జలాలను చెరువులోకి వదిలితే సహించేది లేదని, ఇంకోసారి అలా చేస్తే అరబిందో ఫార్మా కంపెనీని తగుల బెడతానని గతంలోనే హెచ్చరించానని గుర్తు చేశారు.. అయినప్పటికీ అరబిందో ఫార్మా మళ్లీ కలుషిత జలాలను చెరువులోకి వదులుతోందని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను (videos and photos) మీడియాకు విడుదల చేసిన ఆయన.. కలుషిత జలాలను చెరువులోకి వదలడం వెంటనే ఆపాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అరబిందో పై చర్యలు తీసుకోవడానికి పీసీబీకి ఒక్క రోజు గడువు ఇస్తున్నానని తెలిపారు. పీసీబీ చర్యలు తీసుకోకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు తాను అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి దాన్ని తగలబెడతానని హెచ్చరించారు. రైతులు (Farmers) నష్టపోతుంటే చూస్తూ ఊరుకొనే ఓపిక తనకు లేదన్నారు. పీసీబీ అధికారులు అరబిందో పై చర్యలు తీసుకుంటారో, లేక దాన్ని తగలబెట్టకతప్పని పరిస్థితి తీసుకొస్తారో ఇక వాళ్ల ఇష్టమని తేల్చి చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News