అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం నుంచి కార్మికులకు లేబర్ కార్డులు ఇవ్వనున్నట్లు కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈమేరకు బిందర్ వర్తక సంఘం భవనం (Trade Association Building)లో భవన నిర్మాణ రంగాల కార్మిక నాయకులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో లేబర్ కార్డు (Labor Card)లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే పాత లేబర్ కార్డులను సైతం రెన్యువల్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్మికులు తమ వెంట రెన్యువల్ కోసం పాత లేబర్ కార్డుతో పాటు ఆధార్ కార్డు (Aadhar Card) తీసుకురావాలని సూచించారు. కొత్త లేబర్ కార్డు కోసం కార్మికులు తమతో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, రెండు ఫొటోలు తీసుకొని రావాలన్నారు.
సమావేశంలో సీనియర్ నాయకులు బెల్దార్ తుకారాం, అవుటి బాబు, ధ్యానబోయిన శ్యాం, గణేష్ మేస్త్రి, ఉప్పరి సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్, ఎల్లారెడ్డి అధ్యక్షుడు లింగం, కార్పెంటర్ వడ్ల సంఘం అధ్యక్షుడు నర్సింలు, పెయింటర్ సంఘం మాజీ అధ్యక్షుడు కంతీ పద్మారావు మాదిగ, జిల్లా నాయకులు అబ్దుల్ రజాక్, ఏర్ల సంగమేశ్వర్ పాల్గొన్నారు.