అక్షరటుడే ఆర్మూర్: Yamadri Kavitha Bhaskar | తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే 3వ వార్డు అభివృద్ధికి శాయాశక్తులా కృషి చేస్తానని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని యామాద్రి కవిత భాస్కర్ (Yamadri Kavitha Bhaskar) అన్నారు. ఈ మేరకు వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
హౌసింగ్ బోర్డు, గణేష్‌నగర్‌లలో..
వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు, గణేష్ నగర్, విద్యానగర్ కాలనీలో అభ్యర్థిని యామాద్రి కవిత భాస్కర్ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో వర్షాకాలంలో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వరద నీరు ఇళ్లలోకి చేరకుండా భారీ కల్వర్టుల నిర్వాణకు కృషి చేస్తానన్నారు. కాలనీలో సీసీ రోడ్లు, మురికి కాల్వలు, డ్రెయినేజీలు, కల్వర్టుల నిర్మాణానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి కృషి చేస్తామన్నారు. మూడో వార్డు బీజేపీ అభ్యర్థినిగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని యామాద్రి కవితా భాస్కర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట వార్డు బీజేపీ నాయకులు, మహిళలు ఉన్నారు.
1 comment
[…] […]
Comments are closed.